యజమాని గట్టిగా ఉంటేనే కుటుంబం క్రమశిక్షణగా ఉంటుంది అంటారు? పోలీసు స్ట్రిక్ట్ గా ఉంటేనే సమాజం క్రమశిక్షణతో ఉంటుంది అంటారు? అదే క్రమంలో పార్టీ అధినేత నిత్యం ఒకేమాట మీద ఉంటే… మిగిలిన పర్టీ నాయకులు కూడా మాటల విషయంలో కాస్త క్రమశిక్షణ కలిగి ఉంటారు. ఈ విషయంలో ప్రస్తుతం టీడీపీ పార్టీ వెనకబడి ఉందనే అనుకోవాలి! ఈ విషయాలపై తాజాగా ప్రూఫ్ ఇప్పించే పనికి పూనుకుంది.. విశాఖ వెళ్లిన టీడీపీ త్రిసభ్య కమిటి!!
విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ సంఘటన జరిగిన అనంతరం జరిగిన అన్ని విషయాలు ప్రజలకు తెలిసినవే! ప్రమాధం జరిగిన ఎనిమిదీ గంటల లోపు ముఖ్యమంత్రి ఆ ప్రదేశాన్ని సందర్శించడం.. పనికి మాలిన సెంటిమెంట్స్ పక్కన పెట్టి విశాఖ ఆస్పత్రిలో అడుగుపెట్టడం, ఎవ్వరూ ఊహించని రీతిలో నష్టపరిహారం ప్రకటించడం తెలిసిందే. ఈ క్రమంలో తనకు డిమాండ్ చేసే అవకాశం లేకుండా చేసిన జగన్ పై… చంద్రబాబు తన అక్కసు వెళ్లగక్కిన సంగతి తెలిసిందే. కోటి రూపాయలు ఇస్తే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా అంటూ గత్యంతరం లేని పలుకులు పలికారు! ఈ క్రమంలో బాబు విశాఖకు పంపిన టీడీపీ త్రిసభ్య కమిటీ (అచ్చెన్నాయుడు, రామానాయుడు, చినరాజప్ప) బాంబు పేల్చారు!
గతంలో మూడేసి లక్షలు, 10 లక్షలు నష్టపరిహారాలు ప్రకటించి, వాటిలో కొన్ని చెల్లించి, ఇంకొన్ని చెల్లించకుండా చేసిన చంద్రబాబు… కోటి ఇస్తే ప్రాణాలు తిరిగి వస్తాయా అని ప్రకటించిన మరుసటిరోజే… ఈ టీడీపీ త్రిసభ్య కమిటీ మెంబర్స్, ఏకంగా 10 రెట్లు ఎక్కువ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే వీరి ఉద్దేశ్యం కోటి ఇస్తే రాని ప్రాణాలు పది కోట్లు ఇస్తే వచ్చేస్తాయనా లేక ఎప్పుడూ 10లక్షలు మించి పరిహారం ఇవ్వని టీడీపీ నేతలకు… జగన్ కోటి రూపాయలు చెప్పి షాక్ ఇచ్చే సరికి… ఏదొకటి మాట్లాడాలని 10కోట్లు అన్నారనుకోవాలా? ఏది ఏమైనా… ఈ ఎక్స్ గ్రేషియాపై పార్టీ అధినేత ఒక మాట అంటే… పార్టీ నాయకులు మరోమాట అనడం మాత్రం… పార్టీపై బాబు కోల్పోతున్న పట్టుకు ఉదాహరణ అని పలువురు అభిప్రాయపడుతున్నారు!!