అమ్మ ప్రేమ; బిడ్డ కోసం వెయ్యి కిలోమీటర్లు నడిచిన అమ్మ…!

-

కరోనా వైరస్ సమయంలో అమ్మ చాలా భయపడుతుంది. తన బిడ్డకు ఎక్కడ కరోనా వస్తుందో అని అమ్మ చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుని తన పిల్లలను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. ఒక అమ్మ తన బిడ్డను కాపాడుకోవడానికి ఉందుగా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. రుక్సానా బో అనే 25 ఏళ్ళ మహిళ తన బిడ్డని కాపాడుకోవడానికి ఎవరూ తీసుకోలేని నిర్ణయం తీసుకుంది.

ఆమె బ్రతుకుదెరువు కోసం మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో నివాసం ఉంటుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమేథి ఆమె సొంత గ్రామం… భర్తతో కలిసి ఆమె కూలి పనులు చేసుకుంటూ నెలకు 10 వేల పైన సంపాదిస్తుంది. లాక్ డౌన్ దెబ్బకు ఉపాధి పోయి, దాచుకున్న డబ్బులు అయిపోయి నరకం చూస్తునారు. తన బిడ్డ కోసం దాచిన సొమ్ముని ఎలాంటి పరిస్థితుల్లో వాడను అని నిర్ణయం తీసుకుంది.

బిడ్డను ఎలా అయినా సరే కరోనా బారిన పడకుండా ఉండటానికి గానూ… ఇక సొంత ఊరు వెళ్లిపోవాలి అనుకుంది. లాక్ డౌన్ అయిపోతుంది అని చెప్పినా ఆమె వినలేదు. కేంద్రం మూడో సారి లాక్ డౌన్ ని పెంచారు. సొంత ఊరుకి వెళ్లిపోవాలి అనుకుంది. ఎందుకంటే ఇండోర్ లో ఎక్కువగా కరోనా కేసులు ఉన్నాయి మరి. నగరం మొత్తాన్ని లాక్ డౌన్ చేయడం తో ఇబ్బంది పడుతున్నారు. ఏమైందో ఏమో పాప మంచి నీళ్ళు తాగడం లేదు.

నడుచుకుంటూ అయినా సరే సొంత ఊరు వెళ్లిపోవాలి అని అనుకుంది. బిడ్డ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని భర్త వద్దని చెప్తున్నా వినకుండా వెళ్లిపోయింది. అమేథి వెళ్తున్న వారి గుంపులో ఊరు బయలుదేరింది. బిస్కెట్లు, బ్రెడ్, జామ్, దుస్తులతో ఓ సంచీ తయారు చేసుకుని రెడీ అయింది. మధ్యలో లారీలు కూడా ఎక్కింది. ఎక్కడా ధైర్యం కోల్పోకుండా నడవాలి అని ఆమె నిర్ణయం తీసుకుని వెళ్లిపోవాలి అనుకుంది. తన మూడేళ్ళ బిడ్డకు కరోనా రావొద్దు అని నిర్ణయం తీసుకుని ఏకంగా వెయ్యి కిలోమీటర్లు నడిచి వెళ్ళింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version