ఓయో రూంలో ఓ టీచర్, స్టూడెంట్ కలిసి ఉన్నారు. అయితే, ఏమైందో తెలియదు కానీ, వీరిద్దరూ మృతి చెందారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీఘర్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది.అక్కడున్న ఓయో రూమ్‌కు ఓ ఉపాధ్యాయుడు, 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని వెళ్లినట్లు సమాచారం.
అయితే, వీరు ఎంతకూ రూమ్ నుంచి బయటకు రాకపోడంతో నిర్వాహకులు డోర్ తెరిచి చూడగా వారి మృతదేహాలు కలకలం రేపాయి.సమాచారం అందుకున్న యూపీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.అనంతరం మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.టీచర్, స్టూడెంట్ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.ప్రేమ వ్యవహారమే కారణమని ప్రాథమిక నిర్దారణకు వచ్చినట్లు సమాచారం.