సీపెట్ హైదరాబాద్‌లో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులు..వివరాలివే..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోకెమికల్స్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

మొత్తం ఖాళీల సంఖ్య 14. పోస్టుల వివరాలలోకి వెళితే.. లెక్చరర్ పోస్టులు 5 (కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, మ్యాథమెటిక్స్‌, ప్లాస్టిక్స్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, వర్క్‌ షాప్‌ ప్రాక్టీస్‌), అసిస్టెంట్‌ ప్లేస్‌మెంట్ కన్సల్టెంట్‌ పోస్టులు 1, అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌ పోస్టులు 1 , ఇన్‌స్ట్రక్టర్‌ (స్కిల్‌డెవలప్‌మెంట్‌) పోస్టులు 4, కన్సల్టెంట్‌ ట్రైనీ (మొబిలైజేషన్‌) పోస్టులు 2.

ఇక శాలరీ విషయానికి వస్తే.. నెలకు రూ.20,000ల నుంచి రూ.35,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇక అర్హతల వివరాల లోకి వెళితే.. పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్‌ డిప్లొమా, బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

అలానే పనిలో అనుభవం కూడా ఉండాలి. సెలెక్షన్ ప్రాసెస్ గురించి చూస్తే.. అకడమిక్‌ మెరిట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 31, 2022.

అప్లై చేసుకోవాల్సిన అడ్రస్‌: ప్రిన్సిపల్ డైరెక్టర్‌ అండ్‌ హెడ్‌, సీఎస్‌టీఎస్‌-హైదరాబాద్‌, ఐడీఏ, ఫేజ్‌-2, చర్లపల్లి, హైదరాబాద్‌ 500051.

Read more RELATED
Recommended to you

Exit mobile version