బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టులో టీమిండియా మరోసారి తడబాటుకు గురైంది. కేవలం 44 పరుగులకే 4 వికెట్లను కోల్పోయింది. పాట్ కమిన్స్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ క్యారీకి క్యాచ్ ఇచ్చి రిషబ్ పంత్ (9) ఔటయ్యాడు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు భారత్ ఇంకా 401 పరుగులు వెనుకపడి ఉంది. అంతకుముందు ఓపెనర్ జైస్వాల్ మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో తొలి బంతికే బౌండరీ బాది, రెండో బంతికే ఔటయ్యాడు.
అనంతరం వికెట్ల పతనం కొనసాగుతూనే ఉన్నది. 6 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. స్టార్క్ బౌలింగ్‌లో మిచెల్ మార్ష్‌కు క్యాచ్ ఇచ్చి శుభ్‌మన్ గిల్ (1) ఔటయ్యాడు. అనంతరం విరాట్ కోహ్లి వికెట్ పడగానే వర్షం మళ్లీ మొదలైంది.క్రీజులోకి వచ్చిన రిషబ్, కేఎల్ రాహుల్‌తో కలిసి తిరిగి పెవిలియన్ బాటపట్టాడు. కేవలం ఆరు పరుగుల లోపే మూడు వికెట్లను టీమిండియా కోల్పోయింది. టార్గెట్ మాత్రం భారీగా ఉండటంతో టీమిండియాకు మరోసారి పరాభవం తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.