టీ ట్వంటి ప్రపంచ కప్ నుంచి టీమిండియా నిష్క్రమణ ఐసీసీ పై తీవ్ర ప్రభావం చూపుతుంది. టీమిండియా టీ ట్వంటి వరల్డ్ కప్ టోర్నమెంట్ లో ఉన్న సమయంలో భారత దేశం లో ఉన్న 100 కోట్లలలో చాలా మంది టీ ట్వంటి ప్రపంచ కప్ మ్యాచ్ లను విక్షించడం ద్వారా బ్రాడ్ కాస్టర్ లకు లాభం ఉండేది. కానీ ప్రస్తుతం ఈ టోర్నమెంట్ లో టీమిండియా లేకపోవడం తో మ్యాచ్ ల వ్యూవర్ షీప్ చాలా తక్కువ గా వస్తుంది.
దీంతో ఐసీసీ కి బ్రాడ్ కాస్టర్ లకు తీవ్ర నష్టం వస్తుందని తెలుస్తుంది. ఈ వ్యూవర్ షీప్ తగ్గడం వల్ల ప్రసార కర్త లకు వ్యాపార ప్రకటనలు తగ్గుతాయి. అలాగే అక్కడి నుంచిఏ ఆదాయం కూడా చాలా వరకు తగ్గుతుంది. దీంతో నష్టం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఐసీసీని బీసీసీఐ శాసిస్తుంది అనే వార్తకు ఈ పరిస్థితి మరొసారి ఉదహారణ గా ఉంటుంది. ఒక వేళ టీమిండియా సెమీస్ వరకు టోర్నమెంట్ లో ఉంటే బ్రాడ్ కాస్టర్ తో పాటు ఐసీసీ కి కూడా చాలా వరకు లాభం ఉంటుంది.