ప్రస్తుత రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారు. అందులో ప్రధానంగా కిడ్నీలో రాళ్ల సమస్యతో ఎక్కువ మంది బాధపడుతున్నారు. మూత్రాశయం, కిడ్నీల్లో ఏర్పడే రాళ్ల వల్ల విపరీతమైన నొప్పి కలగడం ఇందులోని ప్రధాన లక్షణం. అయితే వాస్తవానికి కిడ్నీలో రాళ్లు బాగా పెరిగే వరకు కూడా అవి ఉన్నట్లు తెలియకపోవడంతో ఈ సమస్య తీవ్రతరమై ఆపరేషన్ వరకు దారి తీస్తోంది.
అయితే వాంతికి వచ్చినట్లు ఉండటం, వికారం, వణుకు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే.. కిడ్నీలో రాళ్లు ఉన్నాయని అర్థం చేసుకొని ముందుగా జాగ్రత్తులు వహించాలి. అదే విధంగా కిడ్నీలో స్టోన్స్ ఉన్న ఆహార విషయంలో తగిన జాగ్రత్తులు తీసుకోకపోతే చాలా ప్రమాదకరం అవుతుంది. మరి కిట్నీలో స్టోన్స్ ఉన్న వారు తినాల్సిన ఆహారం ఏంటి? తినకూడని ఆహారం ఏంటి? అన్న ప్రశ్న అందరిలోనూ ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కిడ్నీలో స్టోన్స్ ఉన్న వారు తినాల్సినవి:
ఉలవలు, దానిమ్మ పండు, చేపలు, పైనాపిల్, నిమ్మకాయ, మొక్కజొన్న, బత్తాయి, కాకరకాయ, క్యారెట్, అరటిపండు, బార్లీ బియ్యం, కొబ్బరిబోండం, బాదంపప్పు ఇలాంటి తీసుకోవడం వల్ల కిడ్నీలో స్టోన్స్ ఉన్న వారికి ఎలాంటి ప్రమాదం ఉండదు.
కిడ్నీలో స్టోన్స్ ఉన్న వారు తినకూడనవి:
వంకాయ, క్యాబేజి, చికెన్, మటన్, ఉసిరికాయ, దోసకాయ, పుట్టగొడుగులు, టమాటా, క్యాలిఫ్లవర్, పాలకూర, గుమ్మడికాయ, సపోట ఇలాంటివి కిడ్నీలో స్టోన్స్ ఉన్న వారు తినకపోవడం ఉత్తమం.