టీమిండియా వ‌న్డే జ‌ట్టులో లోపం ఉంది : హెడ్ కోచ్ ద్రావిడ్

-

సౌత్ ఆఫ్రికాతో జ‌రిగిన వ‌న్డే సిరీస్ లో టీమిండియా దారుణంగా విఫ‌లం అయిన విష‌యం తెలిసిందే. మూడు వ‌న్డే సిరీస్ లో టీమిండియా ను సౌత్ ఆఫ్రికా క్లీన్ స్వీప్ చేసింది. కాగ ఈ సిరీస్ ఓట‌మి పై టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తాజా గా స్పందించాడు. టీమిండియా వ‌న్డే జ‌ట్ట‌లో స‌మ‌తుల్య‌త లోపించింద‌ని అన్నారు. అలాగే సౌత్ ఆఫ్రికా సిరీస్ త‌మ లోపాల‌ను ఎత్తి చూపింద‌ని అన్నారు. ఈ లోపాల‌ను ప్ర‌పంచ క‌ప్ నాటికి స‌రిదిద్దుకుంటామ‌ని అన్నారు.

అయితే ఈ సిరీస్ ను కోల్పోవడం ప్ర‌ధానంగా మీడిల్ ఆర్డర్ విఫ‌లమే అని అన్నారు. ఓపెన‌ర్లు స్కోరు అందిస్తున్నా.. మిడిలార్డ‌ర్లు విఫ‌లం అవ‌డంతో మ్యాచ్ త‌మ జ‌ట్టు నుంచి ప్ర‌త్య‌ర్థి జ‌ట్టులోకి వెళ్తుంద‌ని అన్నారు. అలాగే శార్ధూల్ ఠాకూర్ తోపాటు దీప‌క్ చాహ‌ర్ ల‌కు బ్యాటింగ్ లోనూ అవ‌కాశం ఇస్తే.. మంచి ఫ‌లితాలు వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అభిప్ర‌య ప‌డ్డాడు. అలాగే కెప్టెన్ గా కెఎల్ రాహుల్ ఈ సిరీస్ విఫ‌లం అయినా.. భ‌విష్య‌త్తులో లోపాల‌ను స‌రి చేసుకుని రాణిస్తాడ‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version