రొమాంటిక్ మంత్ గా చెప్పుకునే ఫిబ్రవరి నెలలో ఈ రోజున టెడ్డీ డే గా జరుపుకుంటారు. ప్రేమికుల రోజుకి వారం ముందు నుండి మొదలయ్యే సందడిలో నాలుగవ రోజున టెడ్డీ డే జరుపుకుంటారు. రోజ్ డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే తర్వాత వచ్చే టెడ్డీ డే రోజున తాము ప్రేమించే వారికి అందమైన టెడ్డీ బేర్ లని గిఫ్ట్ గా ఇచ్చుకుంటారు. ఇలా ఒకరికొకరు బహుమతిగా ఇచ్చుకునే ఈ రోజుకి చాలా ప్రత్యేకత ఉంది. ప్రేమికులు తమ ప్రేమని రకరకాలుగా వ్యక్తీకరించుకుంటారు.
ప్రేమని వెలిబుచ్చడానికి ముందు ఏదైనా బహుమతి తీసుకుంటారు. అలాంటి బహుమతుల్లో టెడ్డీలు ఒకటి. అందంగా క్యూట్ గా ఉండే టెడ్డీబేర్ లని ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. అందుకే వాటిని బహుమతిగా ఇచ్చి మరీ తమ ప్రేమని తెలుపుతారు. ఐతే మీ ప్రేమించినవారికి టెడ్డీ రోజున టెడ్డీ బేర్ ని బహుమతిగా ఇచ్చేవారు ఊరికే ఇచ్చేస్తే ఎలా? బహుమతితో పాటు రెండు అక్షరం ముక్కలు రాస్తే బాగుంటుంది కదా! అలాంటి అక్షరాలు కావాలనుకున్న వారికోసం ఈ కొటేషన్లు.
నేను నీ పక్కన లేనప్పుడు నీతో నేనున్నానన్న భావన కలిగించడానికి టెడ్డీ బేర్ ని బహుమతిగా పంపిస్తున్నా. హ్యాపీ టెడ్డీ డే డియర్.
నువ్వు నవ్వితే టెడ్డీ అంత అందంగా కనిపిస్తావు. హ్యాపీ టెడ్డీ డే డియర్..
ప్రపంచంలోనీ బాధలు ఎవరు వినకపోయినా వినడానికి రెడీగా ఉండేది టెడ్డీ మాత్రమే.. నాలాగే.
ఎన్నో బహుమతులకి కాలం చెల్లవచ్చు. కానీ కాలం చెల్లని ఖరీదైన, విలువైన బహుమతి ఏదైనా ఉందంటే అది టెడ్డీ బేర్ మాత్రమే. హ్యాపీ టెడ్డీ డే స్వీట్ హార్ట్.