Teenmar Mallanna: కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నాయకులు, తెలంగాణ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన ప్రకటన చేశారు. కొత్త పార్టీని ప్రకటించారు తీన్మార్ మల్లన్న. ఈ మేరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. జెండాలో ఒకవైపు వరి కంకులు, మరోవైపు కార్మికుల గుర్తు ఉండేలా పార్టీ జెండాను రూపొందించారు తీన్మార్ మల్లన్న. పార్టీ జెండా ఆవిష్కరణ అనంతరం రాష్ట్ర కమిటీని ప్రకటించిన తీన్మార్ మల్లన్న… బీసీ నినాదం ఎత్తుకున్నారు.

బీసీలకు రాజ్యాధికారం అందించడమే లక్ష్యంగా తీన్మార్ మల్లన్న పార్టీ ఏర్పాటు చేశారు. గతంలో న్యూస్ యాంకర్ గా పనిచేసిన తీన్మార్ మల్లన్న…. ఆ తర్వాత బీఆర్ ఎస్ పార్టీలోకి వెళ్లారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలోకి… అక్కడి నుంచి బీజేపీ, ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ అయ్యారు. ఇక ఇప్పుడు పార్టీ ఏర్పాటు చేశారు.
పార్టీ పేరు: తెలంగాణ రాజ్యాధికార పార్టీ
పార్టీని ప్రకటించినది: తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్ కుమార్)
జెండాలోని చిహ్నాలు:
ఒకవైపు వరి కంకులు, ఇది రైతులను మరియు వ్యవసాయ రంగాన్ని సూచిస్తుంది.
మరోవైపు కార్మికుల గుర్తు, ఇది శ్రామిక వర్గం మరియు వారి హక్కులకు ప్రాధాన్యత ఇస్తుంది.