13 నుంచి తెలంగాణ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్..

-

తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో పర్యాటక శాఖ తెలంగాణ 4వ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ను ఈ నెల 13 నుంచి 15 వరకు నిర్వహించనుంది.  నగరంలోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఫెస్టివల్ నిర్వహాణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకు గాను కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ బ్రోచర్‌ను రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 2016 నుంచి తెలంగాణ  ప్రభుత్వం నిర్వహిస్తున్న కైట్స్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్ ను  ఈ ఏడాది సైతం ఘనంగా నిర్వహించేందుకు అన్ని  ఏర్పాట్లు పూర్తి  చేస్తున్నామని తెలిపారు.

అన్ని వర్గాల వారు ఆనందంగా జరుపుకునే ఈ ఫెస్టివల్తో నగరం నూతన శోభను సంతరించుకుందన్నారు.   ఓ వైపు నోరూరించే వివిధ రకాల స్వీట్లు మరోవైపు ఆనందాన్ని పంచే కైట్లతో సంక్రాంతి సంబరాలు అంబారాన్నిఅంటనున్నాయి. ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లో రంగు రంగుల గాలిపటాలతో చిన్నారులు సందడి చేస్తున్నారు. ప్రభుత్వం అందిస్తోన్న ప్రోత్సహంతో పాటు, పర్యాటకులను ఆకర్షించి ఈ ఏడాది బిజినెస్ బాగా జరగాలని గాలిపటాల తయారీదారులు, వర్తకులు కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version