తెలంగాణలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. పరీక్షలు లేకుండానే పదో తరగతి విద్యార్ధులను పాస్ చేసారు. ఇంటర్నల్, అసెస్‌మెంట్ మార్కుల ఆధారంగా విద్యార్ధులను ప్రమోట్ చేయాలన్నారు. మొత్తం 5,34,903 మంది విద్యార్ధులను ప్రమోట్ చేయనున్నారు. ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడింగ్ నిర్ణయిస్తారు. అటు డిగ్రీ, పీజీ పరిక్షల నిర్వహణపైనా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది.