ఈనెల 12, 13 తేదీల్లో తెలంగాణ అసెంబ్లీ మరో మారు సమావేశం కానుంది. గత నెల 7 నుంచి నిర్వహించి న సమావేశాలను కరోనా కారణంగా నిరవధికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే గ్రేటర్ హైదరాబాద్ చట్టాల్లో కొన్ని సవరణలు చేయడంతో పాటు హైకోర్టు సూచించిన మరి కొన్ని అంశాల్లో చట్టాలు చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం బావిస్తోంది. ఈనేపథ్యంలోనే మరో రెండు రోజులు అంటే సోమ, మంగళవారాల్లో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనిపై నేడు ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్‌కు నవంబరు లేదా డిసెంబరులో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ ఎన్నికల్లోపే జీహెచ్‌ఎంసీ చట్టాన్నిసవరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ యోచిస్తున్నారు. తెలంగాణ మునిసిపల్ చట్టం-2019లో ఈ నిబంధన ఉన్నప్పటికీ ఇది గ్రేటర్ హైదరాబాద్కు వర్తించదు. ఈక్రమంలోనే రిజర్వేషన్‌లు వరుసగా రెండో పర్యాయం వర్తించేలా నిబంధనను పొందుపరిచేందుకు తొలుత ఆర్డినెన్స్ తేవాలని నిర్ణయించినప్పటికీ, మరికొన్ని చట్టాల సవరణలు అవసరమున్న నేపథ్యంలో రెండు రోజులపాటు అసెంబ్లీని సమావేశపర్చాలని ప్రభుత్వం యోచిస్తోంది.