మార్వాడీలపై గత కొద్ది రోజుల నుంచి వ్యాపారస్తులు దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. మార్వాడీలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఈనెల 22న రాష్ట్రవ్యాప్త బంద్ కు పిలుపునిస్తున్నట్లు ఓయూ జేఏసీ వెల్లడించింది. గుజరాత్, రాజస్థాన్ నుంచి మార్వాడీలు తెలంగాణ ప్రాంతానికి వలస వచ్చి కులవృత్తులను దెబ్బతీస్తున్నారని వ్యాపారస్తులు మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రజలను మార్వాడివారు విపరీతంగా దోచుకుంటున్నారని ఆరోపణలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా మార్వాడి గో బ్యాక్ అంటూ జేఏసీ నేతలు నినాదాలు చేశారు. ఇదిలా ఉండగా… గత కొద్ది రోజుల క్రితం మార్వాడీలపై తెలంగాణలోని ఇతర వ్యాపారస్తులు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని అంటున్నారు. మార్వాడీల వల్ల వారి వ్యాపారాలు పూర్తిగా దెబ్బ తింటున్నాయని వారికి ఎలాంటి లాభం చేకూరడం లేదని మండిపడుతున్నారు. ఒకవేళ తెలంగాణ ప్రాంతం నుంచి మార్వాడీలను నిజంగా పంపించినట్లయితే వారికి భారీగా నష్టం వాటిల్లుతుంది. మార్వాడీల వ్యాపారాలు పూర్తిగా దెబ్బతింటాయి. వారు చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని మార్వాడీలు ఫైర్ అవుతున్నారు.