24 లక్షలకు చేరిన తెలంగాణ బీజేపీ సభ్యత్వ నమోదు

-

Telangana BJP Membership: 24 లక్షలకు చేరిన తెలంగాణ బీజేపీ సభ్యత్వ నమోదు కావడం జరిగింది. ఈ మేరకు బీజేపీ పార్టీ మాజీ ఎమ్మెల్సీ, మెంబర్షిప్ రాష్ట్ర ఇంఛార్జి రామచంద్రరావు ప్రకటన చేశారు. ఈ నెల 30 వరకు సభ్యత సమోదు కార్యక్రమం పొడిగించినట్లు చెప్పారు. పండుగల కారణంగా కొంత నెమ్మదిగా సభ్యత్వ నమోదు జరుగుతున్నట్లు స్పష్టం చేశారు మాజీ ఎమ్మెల్సీ, మెంబర్షిప్ రాష్ట్ర ఇంఛార్జి రామచంద్రరావు. 4 లక్షల మిస్డ్ కాల్ మెంబర్షిప్, 20 లక్షలు ఆన్ లైన్ మెంబర్ షిప్ వచ్చిందన్నారు.

Telangana BJP Membership Registration Reached 24 Lakhs

ఇది ఇలా ఉండగా, జనవరి నాటికి బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడు నియామకం ఉంటుందని అంటున్నారు. పలు రాష్ట్రాల్లోనూ బీజేపీ అధ్యక్షులు..మారనున్నట్లు సమాచారం. పార్టీ సంస్థాగత ఎన్నికల కసరత్తు ప్రారంభించింది బీజేపీ. సార్వత్రిక ఎన్నికల సమయంలో జాతీయ అధ్యక్షుడి తో పాటు కొన్ని రాష్ట్రాల అధ్యక్షుల పదవీకాలాన్ని పొడిగిస్తూ పార్టీ తీర్మానం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version