దారుణంగా పడిపోయిన GHMC ఆదాయం.. రూ.300 కోట్లు డౌన్ !

-

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత జిహెచ్ఎంసి ఆదాయం దారుణంగా పడిపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. తాజాగా.. ఓ నివేదిక ప్రకటించిన లెక్కల ప్రకారం 2023 నుంచి 2024 లో 300 కోట్ల ఆదాయం తగ్గిందట. హైదరాబాద్ మహానగరంలో బహుళ అంతస్తుల నిర్మాణాలు పూర్తిగా తగ్గిపోయాయట.

హైడ్ర లాంటి చర్యలు తీసుకున్న నేపథ్యంలో.. ఎవరు పెద్ద అంతస్తులు కట్టేందుకు ముందుకు రావడం లేదట. ఈ తరుణంలోనే.. జిహెచ్ఎంసి కి ఆదాయం తగ్గిపోయిందని లెక్కలు చెబుతున్నాయి. దాదాపు 300 కోట్లు తగ్గిందని సమాచారం. ఇక దీనిపై కేటీఆర్.. కూడా స్పందించారు.

తెలంగాణ రాష్ట్ర ఆదాయం తగ్గుతోంది, కాంగ్రెస్ నాయకుల ఆదాయం అమాంతం పెరుగుతోందని పేర్కొన్నారు కేటీఆర్. పదేళ్లపాటు బుల్లెట్ వేగంతో.. పరుగులు పెట్టిన తెలంగాణకు అసమర్థ, అవినీతి పాలనే శాపం గా మారిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పులపై తప్పులు చేసి.. తీరా తగ్గిన ఆదాయంపై అధ్యయనం చేయాలని ఆదేశించడం.. ఇందుకోసం ఏకంగా ఇతర రాష్ట్రాలకు బృందాలను పంపించడం..మీ అజ్ఞానానికి మరో సజీవ సాక్ష్యం అంటూ ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version