తెలంగాణ రాష్ట్ర కేబినెట్ అత్యవసర భేటీ అయిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ అత్యవసర భేటీ అయింది. ఈ సందర్భంగా..లాక్ డౌన్ పై కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ కేబినెట్. లాక్ డౌన్ ను సంపూర్ణంగా ఎత్తివేయాలని తెలంగాణ రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని, వైద్యశాఖ అధికారులు అందించిన నివేదికలను పరిశీలించిన కేబినెట్, ఈ మేరకు లాక్ డౌన్ ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నది.
లాక్ డౌన్ సందర్భంగా విధించిన అన్ని రకాల నిబంధనలను పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను కేబినెట్ ఆదేశించింది. తెలంగాణ కేబినెట్ తాజా నిర్ణయంతో బార్లు, థియేటర్లు తెరిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే.. అంతరాష్ట్ర బస్సు సర్వీసులపై ఇంకా క్లారిటీ రాలేదు.