తెలంగాణ కేబినెట్ సమావేశం కాసేపటికి క్రితమే ప్రారంభం అయింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం అయింది. ఈ నెల 25 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఆరు నెలలు పూర్తవుతుందన్న నేపథ్యంలో సమావేశాల తేదీల ఖరారు చేసే అవకాశం ఉంది.
దళిత బంధు అమలు పై చర్చ..ప్రతి సంవత్సరం బడ్జెట్ లో 20 వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. శాసనసభ లో ప్రతి పక్షాల మాటలకు కౌంటర్ ఇవ్వడం పై మంత్రులకు కేసీఆర్ దిశ నిర్దేశం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే కృష్ణ జలాల వివాదం పై కేంద్ర పెద్దలను కలిసిన సీఎం కేసీఆర్ అదే విషయంలో మంత్రులతో కూడా చర్చించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య విద్యుత్ వివాదం పై కూడా సమావేశం లో చర్చించనున్నారు. ఉద్యోగల భర్తీ పై కేబినెట్ లో చర్చ జరిపి నోటిఫికేషన్స్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.