ఇది ప్రజల విజయం.. ఎవ్వడైనా దుర్మాగాలకు పాల్పడితే ఇదే గతి పడుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క హెచ్చరింది. ప్రభుత్వాలు విఫలమైనా.. ప్రజా పోరాటాల ఫలితంగానే ..ఆ కామాంధుడు రాజుకు వెన్నులో వణుకుపుట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. సైదాబాద్ లో జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా అందర్ని కదిలించింది. సింగరేణి కాలనీకి చెందిన ఆరేళ్ల చిన్నారిపై రాజు అనే మృగాడు అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి.. అనంతరం హత్య చేశాడు.
ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో పోలీసులు ఈ కేసును చాలా సిరీయస్ గా తీసుకున్నారు. దీంతో ఎక్కడ పోలీసులు అరెస్టు చేసి.. శిక్షిస్తారో భయపడ్డ నిందితుడు.. స్టేషన్ ఘన్‌పూర్‌కు సమీపంలో రాజు రైల్వే ట్రాక్‌పై శవమై తేలాడు. మృతుడి చేతిపై ‘మౌనిక’ అని రాసున్న పచ్చబొట్ట ఆధారంగా మృతదేహం రాజుదేనని పోలీసులు నిర్థారించారు
ఈ ఘటనపై ఎమ్మెల్యే సీతక్క స్పందిస్తూ.. ఇది ప్రజల విజయమని అభివర్ణించారు. ఈ దారుణంపై
వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని, నిందితుడు రాజును కఠినంగా శిక్షించాలని పోరాటాలు జరుగుతున్నాయని గుర్తుచేశారు.
ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసిందనీ, నిందితుడి పట్టుకోక ముందే పట్టుకున్నామని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో పోస్టు చేయడాన్ని తప్పుపట్టింది. నిందితుడ్ని పట్టుకోవడంలో పోలీసులు, ప్రభుత్వం విఫలమయ్యింది. కానీ.. ప్రజల పోరాటాల వల్ల నిందితుడ్ని వెన్నులో వణుకుపుట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడని అన్నారు.
భవిష్యత్తులో ఎవరైనా.. ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడితే ఇదే గతి పడుతుందని హెచ్చరించింది. అదే సమయంలో రాజు తప్పులతో సంబంధంలేని అతని బిడ్డను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సీతక్క పేర్కొన్నారు.