రైతుల ధాన్యం కొనేది భారత ప్రభుత్వమే అని స్పష్టం చేశారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు . దేశంలో ఏ ముఖ్యమంత్రికి రాని ధాన్యం సమస్య కేసీఆర్ కే ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. గల్లీలో వార్డు మెంబర్ గా గెలవని రాకేష్ టికాయత్… ప్రతిపక్షాలు ఐక్యంగా ఉండాలని సుద్దులు చెబుతున్నారని…ఢిల్లీలో జరిగింది రైతు దీక్ష కాదని కేసీఆర్ దేశ్ కీ నేత అని హోర్డింగులు పెడుతున్నారని విమర్శించారు. వడ్లు కొనాలని ఐకేపీ సెంటర్ కు వెళ్లి ముచ్చట చెబుతావా…? లేక ఢిల్లీకి వెళ్లి దేశ్ కీ నేత అని హోర్డింగులు పెట్టించుకుంటావా..? అని ప్రశ్నించారు.
దేశంలో ఏ ముఖ్యమంత్రికి రాని ధాన్యం సమస్య కేసీఆర్ కే ఎందుకు వచ్చింది: రఘునందన్ రావు
-