తెలంగాణా కాంగ్రెస్ కి కొత్త ఇంచార్జ్ వచ్చిన మానిక్కం టాగూర్ వినూత్న నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. తాజాగా ఆయన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ లకు పని విభజన చేశారు. పార్లమెంట్ వారీ గా ఏఐసీసీ ఇంఛార్జి టాగూర్ బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం నలుగురు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ లు గా ఉన్నారు. అందులో ఒకరు రేవంత్ రెడ్డి, మరొకరు జెట్టి కుసుమ కుమార్,మరొకరు పొన్నం ప్రభాకర్ కాగా మరొకరు మాజీ క్రికెటర్ అజారుద్దీన్.
ఇక రేవంత్ రెడ్డికి ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్, జహీరా బాద్, మహబూబా బాద్ జిల్లాలు అప్పగించగా పొన్నం ప్రభాకర్ కి మెదక్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల, ఖమ్మం అప్పగించారు. ఇక జెట్టి కుసుమ కుమార్ కు మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, భువనగిరి, వరంగల్ బాధ్యతలు అప్పగించారు. అజారుద్దీన్ కి పార్టీ అనుబంధ సంఘాల బాధ్యతలు అప్పగించారు.