ఐపీఎల్ సీజన్ లో ఎన్నో అంచనాల మధ్య రంగంలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మొదట ఎంతో దూకుడుగా ఆడి వరుస విజయాలను సొంతం చేసుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సీజన్ మొదట్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు దూకుడు చూస్తే ఈ ఏడాది టైటిల్ గెలవడం ఖాయం అని అనుకున్నారు అందరు. కానీ ప్లే ఆప్ ముంగిట వరుస పరాజయాలను మూటగట్టుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అతికష్టంమీద ప్లే ఆప్ కి అర్హత సాధించింది.
ఇక ఇటీవల జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ఓటమి చవిచూసి ఐపీఎల్ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. నిన్నటి ఓటమి పై స్పందించిన బెంగళూరు జట్టు ఆటగాడు ఎబి డివిలియర్స్ భావోద్వేగానికి గురయ్యారు. ఐపీఎల్ సీజన్ లో టైటిల్ గెలవనందుకు ఎంతో విచారం వ్యక్తం చేస్తున్నా అంటూ తెలిపాడు. అభిమానుల అంచనాలను అందుకోలేకపోయినందుకు క్షమించాలి అంటూ వాపోయాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తమకు అండగా నిలిచి సపోర్ట్ చేస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు ఎబి డివిలియర్స్.