విజృంభిస్తున్న కరోనా రక్కసి.. కొత్తగా ఎన్నికేసులంటే..?

-

కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగతూ వస్తోంది. మొన్నటి వరకు తగ్గముఖం పట్టిన కేసులు ఇప్పుడు మళ్లీ పెరుగుతుండడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. థర్డ్‌ వేవ్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి. అంతేకాకుండా ఇప్పుడు ఫోర్త్‌ వేవ్‌ వచ్చినా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటనలు చేస్తున్నాయి. అయితే.. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 26,976 కరోనా పరీక్షలు నిర్వహించగా, 516 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాదులో 261 కొత్త కేసులు నమోదయ్యాయి.

గత కొన్నిరోజులుగా హైదరాబాదు జిల్లాలో 250కి పైన రోజువారీ కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. ఇక, రంగారెడ్డి జిల్లాలో 43, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 43, మంచిర్యాల జిల్లాలో 34, సంగారెడ్డి జిల్లాలో 24 కేసులు గుర్తించారు. అదే సమయంలో 434 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో తాజాగా కరోనా మరణాలేవీ నమోదు కాలేదు. ఇప్పటిదాకా కరోనాతో మొత్తం 4,111 మంది మరణించారు. తెలంగాణలో ఇప్పటివరకు 8,01,922 మంది కరోనా బారినపడగా…. 7,93,027 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అలాగే.. 4,784 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version