తెలంగాణ క్యాబినెట్ కీలక సమావేశం నిర్వహించనుంది. రేపు మధ్యాహ్నం సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రులందరూ సమావేశం కానున్నారు. ప్రగతి భవన్ లో మద్యాహ్నం 2 గంటలకు ఈ కీలక సమావేశం జరగనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల గురించి కరోనా వ్యాధి గురించి కీలక సమావేశం జరగనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గతంలో రోజుకి 1000 లోపు ఉండే కోవిడ్ కేసులు ప్రస్తుతం 2500 దాటాయి. మరోవైపు ఓమిక్రాన్ కేసులు కూడా విజృంభిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం అలెర్ట్ కాబోతుంది.
ఇదిలా ఉంటే రాజకీయ పరిస్థితుల గురించి కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రతిపక్ష బీజేపీ ఉపాధ్యాయ బదిలీలు, 317 జీవోపై పోరాడుతోంది. ఇటీవల ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రగతి భవన్ కూడా ముట్టడించేందుకు ప్రయత్నించారు. రాష్ట్రంలో బీజేపీ నిరసనలకు విమర్శలను స్ట్రాంగ్ గా తిప్పికొట్టాలని మంత్రులకు కు దిశా నిర్దేశం చేసే అవకాశం ఉంది.