ఎన్నికల వరాల బడ్జెట్..అదొక్కటే లోటు!

-

ఎన్నికలే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం తాజా బడ్జెట్‌ని ప్రవేశపెట్టినట్లు కనిపిస్తుంది. షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే..నవంబర్ లేదా డిసెంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. లేదా ముందస్తు ఎన్నికలకు వెళితే ఏప్రిల్ లేదా మే లో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక ఎటు చూసుకున్న ఇదే చివరి బడ్జెట్ అన్నట్లు. అందుకే ఇప్పుడే ప్రజలని ఆకర్షించేలా బడ్జెట్ ప్రవేశపెట్టారని చెప్పవచ్చు. అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి రెండిటినీ కవర్ చేసి బడ్జెట్ ప్రవేశ పెట్టారు.

మొత్తం రూ.2,90,396 కోట్లతో బడ్జెట్‌‌ను రూపొందించారు. రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లు ఉండగా, మూలధన వ్యయం రూ.35,525 కోట్లుగా ఉంది. బడ్జెట్‌లో ఏ శాఖకు ఎన్ని కోట్లు కేటాయించారనేది చూస్తే.

  • విద్యా రంగానికి రూ.19,093 కోట్లు
  • కేసీఆర్ న్యూట్రిషన్ కిట్‌కు రూ.200 కోట్లు
  • పల్లె, పట్టణ ప్రగతికి రూ.4,834 కోట్లు
  • డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్లకు రూ.12వేల కోట్లు
  • ఆరోగ్యశ్రీకి రూ.14,063 కోట్లు
  • పంచాయతీ రాజ్‌కు రూ.31,426 కోట్లు
  • రుణమాఫీకి రూ.6,385 కోట్లు
  • షెడ్యూల్ కులాల ప్రత్యేక ప్రగతి నిధికి రూ,.36,750 కోట్లు
  • మహిళా శిశు సంక్షేమ శాఖకు రూ.2,131 కోట్లు
  • గ్రామీణ రోడ్లకు రూ.2 వేల కోట్లు
  • హరితహారం పథకానికి రూ.1,471 కోట్లు
  • పురపాలక శాఖకు రూ.11,372 కోట్లు
  • రోడ్లు, భవనాల శాఖకు రూ.2,500 కోట్లు
  • పరిశ్రమల శాఖకు రూ.4,037 కోట్లు
  • హోంశాఖకు రూ.9,599 కోట్లు
  • మైనార్టీ సంక్షేమానికి రూ.2,200 కోట్లు
  • రైతు బీమా పథకానికి రూ.1,589 కోట్లు
  • రైతు బంధు పథకానికి రూ.1,575 కోట్లు
  • వైద్యారోగ్య శాఖకు రూ.12,161 కోట్లు
  • వ్యవసాయ శాఖకు రూ.26,831
  • గిరిజన సంక్షేమం, ప్రభుత్వ ప్రత్యేక ప్రగతి నిధికి రూ.15,223 కోట్లు
  • నీటి పారుదల రంగానికి రూ.26,885 కోట్లు
  • కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలకు రూ.3,210 కోట్లు
  • ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ.3,117 కోట్లు
  • విద్యుత్ రంగానికి రూ.12,727 కోట్లు
  • ఆయిల్‌ ఫామ్‌కు రూ.వెయ్యి కోట్లు
  • దళిత బంధుకు రూ.17,700 కోట్లు
  • ఆసరా పెన్షన్లకు రూ.12 వేల కోట్లు
  • బీసీ సంక్షేమానికి రూ.6,229 కోట్లు

బడ్జెట్‌లో పెద్ద ఎత్తున ప్రతి రంగానికి కేటాయింపులు చేశారు . అయితే కీలకమైన హామీ అయిన నిరుద్యోగ భృతిపై మాత్రం ఎలాంటి సమాచారం లేదు. గత ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని అన్నారు. కానీ  హామీని ఇప్పటికీ నెరవేర్చలేదు. అటు గిరిజన బంధు ఊసు లేదు. మొత్తానికి ఎన్నికలే టార్గెట్ గా బడ్జెట్ ప్రవేశపెట్టారని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version