కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ వాటా ఎంత?.. అంచనాలు ఇవే

-

పార్లమెంటులో ఈనెల 23వ తేదీన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. ఈ పద్దుపై రాష్ట్ర ప్రభుత్వం భారీ ఆశలు పెట్టుకుంది. పెండింగులో ఉన్న ప్రాజెక్టులతోపాటు కొత్తగా మరికొన్నింటికి నిధులు ఇవ్వాలని ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఈసారైనా నిధులు ఆశించిన స్థాయిలో దక్కుతాయని ఎదురుచూస్తోంది.

గత మూడేళ్లుగా కేంద్రం నుంచి గ్రాంట్ల పద్దు కింద పూర్తిస్థాయిలో నిధులు రాక తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఇటీవల ప్రధాని మోదీకి సైతం సీఎం రేవంత్‌రెడ్డి విన్నవించారు. గతేడాది రాష్ట్ర బడ్జెట్‌లో కేంద్రం నుంచి గ్రాంట్లుగా రూ.41,259 కోట్లు వస్తాయని రాష్ట్రం అంచనా వేస్తే.. చివరికి రూ.9,729 కోట్లు మాత్రమే వచ్చాయి. ఈసారి అలా జరగకుండా కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తాయనేది పక్కా అంచనాలతో రాష్ట్ర బడ్జెట్‌ను రూపొందించాలని కసరత్తులు చేస్తోంది. కేంద్రం మద్దతుతో రాష్ట్రంలో స్థాపించాల్సిన వివిధ ప్రాజెక్టులు, సంస్థలపై తెలంగాణ ఒక జాబితాను రూపొందించింది. అక్కడి నుంచి వచ్చే నిధులను ఆధారంగా చేసుకుని, రాష్ట్ర ప్రభుత్వం వీటిని ప్రారంభించే ఆలోచనతో ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version