నిజామాబాద్ రైతు మహోత్సవ సభలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రైతులకు వ్యవసాయం రాదని.. ఆంధ్రప్రదేశ్ రైతులు ఇక్కడి వారికి వ్యవసాయం చేయడం నేర్పించారని అన్నారు.
1923లో నిజాంసాగర్ ప్రాజెక్టు వచ్చినప్పుడు ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాల నుండి రైతులు వచ్చి బాన్సువాడ, బోధన్, డిచ్‌పల్లిలో స్థిరపడ్డారని.. అనంతరం ఇక్కడి రైతులకు వ్యవసాయం చేయడం నేర్పించారని టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై తెలంగాణ రైతాంగం, యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్ర రైతులు నేర్పించక ముందు ఇక్కడి రైతులు వ్యవసాయమే చేయలేదా? అని తీవ్ర విమర్శలు చేస్తున్నారు.