విద్యార్థులకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌న్యూస్‌!

-

తెలంగాణ సర్కార్‌ విద్యార్థులకు ఓ శుభవార్తను తెలిపింది. నీట్, ఎంసెట్, జేఈఈ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు ఉచిత కోచింక్‌ అందించనున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలు తెలుసుకుందాం.

ఉచితంగా షార్ట్‌ టైమ్‌ కోచింగ్‌ ను ఆన్లైన్‌ ద్వారా అందించనున్నట్లు తెలిపింది. ఈ కోచింగ్‌ ను తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గత నెల 23న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వివిధ సబ్జెక్టుల్లో పేరొందిన లెక్చరర్లతో ఈ ఆన్లైన్‌ శిక్షణను అందిస్తున్నమని చెప్పారు.

కేవలం తెలంగాణ నుంచే కాకుండా దేశ వ్యాప్తంగా విద్యార్థులు కోచింగ్‌కు హాజరయ్యారు. ఈ 20 వేల మందిలో 2, 685 మంది విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించినట్లు మంత్రి తెలిపారు.
వారు చూపిన ప్రతిభ కారణంగా మరోమారు కోచింగ్‌ కొనసాగించినట్లు మంత్రి వివరించారు. విద్యార్థులు ఉచిత ఆన్లైన్‌ కోచింగ్‌ కోసం http://tscie.rankr.io లింక్‌ ద్వారా పొందాలని అధికారులు సూచించారు. ఇదిలా ఉండగా కోచింగ్‌ ఇవ్వడానికి వివిధ ప్రైవేట్, కార్పొరేట్‌ సంస్థలు లక్షల రూపాయలను వసూలు చేస్తున్నాయి. అందుకే ప్రభుత్వం అందించే ఈ ఉచిత కోచింగ్‌ ను సద్వినియోగం చేసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version