తెలంగాణలో రూ. 50 వేల రూపాయల లోపు రైతు రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది కేసీఆర్ సర్కార్. 2018 లో ప్రకటించిన రైతు రుణమాఫీ పథకం కు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. అంటే 2018 నుంచి రుణమాఫీ అమల్లోకి రానుంది. ఈ ఉత్తర్వుల ప్రకారం..ఆగస్టు 16 నుంచి రైతుల ఖాతాలం్లో రుణమాఫీ డబ్బులు జమకానున్నాయి.
ఇక ఇప్పటికే 25 వేల లోపు ఉన్న రుణాలకు సంబంధించి మాఫీ చేసింది సర్కార్. ఆగస్టు 15 నుండి 50 వేల లోపు ఉన్న రైతుల రైతు రుణమాఫీ పై తాజాగా మార్గదర్శకాలు జారీ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది కేసీఆర్ సర్కార్. రూ. 50 వేల లోపు ఉన్న రైతులు 6 లక్షల మంది ఉండగా.. దీనికి గాను రూ. 2006 కోట్లను విడుదల చేయనుంది. రూ. 50 వేల లోపు రైతు రుణమాఫీ అమలు కోసం ఇప్పటికే రూ.1850 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేసీఆర్ ప్రభుత్వం.