వార్డుకో ఆఫీసర్‌.. మున్సిపాలిటీలకు 1,862 పోస్టులు మంజూరు

-

తెలంగాణలోని గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. మొత్తం 9,168 పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే.. ఈ పోస్టులను టీఎస్‌పీఎస్‌సీ ద్వారా భర్తీ చేయనున్నారు. అలాగే ఇదిలా ఉంటే..మున్సిపాలిటీలకు 1,862 పోస్టులు మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం.

ఇందులో భాగంగానే మున్సిపాలిటీల్లో వార్డుకో ఆఫీసర్‌ విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన పోస్టులను మంజూరు చేసింది. దీని కోసం 1,862 పోస్టులు మంజూరు చేసింది. ఇలా చేయడం దేశంలోనే తొలిసారిగా కావడం విశేషం. ఇటీవల తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఇప్పటికే 503 గ్రూప్‌ 1 పోస్టులకు ప్రిలిమ్స్‌ పరీక్షలను పూర్తిచేసింది. దీనికి సంబంధించి ప్రాథమిక ఆన్సర్‌ కీ కూడా విడుదల చేసింది. ఇక గ్రూప్‌ -2 కింద 663 పోస్టులకు, గ్రూప్‌-3 కింద 1373 పోస్టులకు, గ్రూప్‌-4 కింద 1298 పోస్టులకు అనుమతి కూడా తెల్పింది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version