మంత్రి మేకపాటి కుటుంబానికి తెలంగాణ సర్కార్‌ బంపర్‌ ఆఫర్‌ !

-

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబానికి తెలంగాణ సర్కార్‌ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా.. తెలంగాణ ప్రభుత్వం… ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తుందని మంత్రి కేటీఆర్‌ ప్రకటన చేశారు. కాసేపటి క్రితమే.. ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు మంత్రి కేటీఆర్‌.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మేకపాటి మృతితో దిగ్భ్రాంతికి గురైయ్యానని.. తనకు ఎంతో దగ్గరి వ్యక్తి అన్నారు. ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న మిత్రుడు అకాల మరణం షాక్ కి గురి చేసిందని.. వారి కుటుంబానికి ఎంత బాధ ఉందొ అర్థం చేసుకోగలనని చెప్పారు. వారికి భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నానని వెల్లడించారు.

12 ఏండ్లుగా నాకు గౌతమ్ రెడ్డికి మంచి పరిచయమని.. చిన్న వయసులో అకాల మరణం చెందడం షాకింగ్ గా ఉందని వెల్లడించారు. మంచి భవిష్యత్ ఉన్న నాయకుడు మృతి జీర్ణించుకోలేకపోతున్నానని.. వారి కుటుంబాన్నికి భగవంతుడు మనో ధైర్యం ఇవ్వాలని ప్రదిస్తున్నానని చెప్పారు. హైద్రాబాద్ లో ఎలాంటి కార్యక్రమాలు చేయాలన్న తెలంగాణ ప్రభుత్వం వారి కుటుంబం వెంట ఉంటుందన్నారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version