రోజువారి కూలీలకు శుభ వార్త..కనీస వేతనాలు పెంచుతూ కేసీఆర్ సర్కార్ నిర్ణయం

-

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత టిఆర్ఎస్ పార్టీ మొదటి సారి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి టిఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చింది.  పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం అనేక పథకాలు తీసుకొచ్చి అందరినీ ఆడుకుంటోంది. అయితే తాజాగా….రోజువారి కూలీలకు శుభ వార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. కూలీలకు కనీస వేతనాన్ని పెంచుతూ కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కూలీలకు రోజు వారి కనీస వేతనాన్ని రూ. 300 నుంచి ఏకంగా రూ. 390 కు పెంచింది.

అలాగే కన్సాలిడేటెడ్ పే వర్కర్ల వేతనం రూ. 8000 నుంచి 10,400 పెంచుతూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అటు పార్ట్ టైం వర్కర్ల వేతనాలు కూడా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. పార్ట్ టైం వర్కర్ల వేతనం నెలకు 4 వేల నుంచి రూ. 5200 కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంచిన వేతనాలను జూన్ 1 నుంచి అమలు అవుతాయని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version