గీత కార్మికులకు తెలంగాణ సర్కార్ శుభవార్త..వారికి కూడా రూ. 5 ఎక్స్ గ్రేషియా

-

గీత కార్మికుల సంక్షేమం కోసం దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ గారి నేతృత్వంలో అమలు చేస్తున్నామన్నారు. గీత కార్మికులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. గీత కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే ప్రభుత్వం అందించే ఎక్స్ గ్రేషియా ను రైతు భీమా తరహాలో అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక ప్రకటన చేశారు.

హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డు లో ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న నీరా కేఫ్’ పనులను మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర గౌడ సంఘాల ప్రతినిధులు, ఆబ్కారీ, పర్యాటక శాఖల ఉన్నతాధికారుల తో కలసి పరిశీలించారు. మరుగున పడిపోతున్న కుల, చేతి వృత్తుల కు పూర్వ వైభవాన్ని తేవాలనే లక్ష్యం తో హైదరాబాద్ లోని ఎంతో విలువైన నెక్లెస్ రోడ్డు లో 25 కోట్ల రూపాయల తో ప్రతిష్టాత్మకంగా దేశంలోనే మొట్టమొదటి సారిగా నీరా కేఫ్ ను నిర్మిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.

ప్రజలకు ఆరోగ్యాన్ని , 15 రకాల వ్యాధుల నివారణకు ఔషధ గుణాలు కలిగిన నీరా, కల్లు ను హైదరాబాద్ నగరంలో నిషేధం విధించి అవమానించారన్నారు. గీత వృత్తిని, వృత్తిదారులను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్న కొంతమంది అహంకార పూరిత రాజకీయ నాయకులకు తగిన గుణపాఠం చెప్పాలని మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ కుల సంఘాల ప్రతినిధులకు పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version