Priyamani: ఫరెవర్ యంగ్ క్వీన్.. పొట్టి గౌనులో ప్రియమణి సొగసులు చూడతరమా..

-

బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రియమణి.. తెలుగులో చాలా కమర్షియల్ సినిమాల్లో నటించింది. ఈ క్రమంలోనే మంచి పేరు సంపాదించుకున్న ఈ భామ.. తమిళ్, హిందీ, కన్నడ ఇతర భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించింది. ప్రజెంట్ ఈ సుందరి టెలివిజన్ షోస్ పైన కాన్సంట్రేట్ చేసినట్లుంది. సినిమాల్లో నటిస్తూనే టెలివిజన్ షోల్లోనూ మెరుస్తోంది. ‘ఢీ 14’ డ్యాన్స్ షోకు జడ్జిగా వ్యవహరిస్తోంది.

 

ప్రియమణి సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియా అకౌంట్స్ లో తన లేటెస్ట్ ఫొటోస్, ఈవెంట్స్ కు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తుంటుంది. తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఈ భామ షేర్ చేసిన ఫొటోలు చూస్తే మతి పోతుంది.

‘‘మీ జీవితమే ఒక కేన్వాస్.. మీరు ఎలా కావాలంటే అలా మీ జీవితాన్ని పెయింట్ చేసుకోవచ్చు.. అలా మీ జీవితాన్ని రంగులమయం చేసుకోండి..’’ అనే క్యాప్షన్ తో ప్రియమణి తన ఫొటోలు షేర్ చేసింది. ఈటీవీ, డ్యాన్స్ ఐకాన్, లవ్ యువర్ సెల్ఫ్ అనే హ్యాష్ ట్యాగ్స్ తో ఈ ఫొటోలు షేర్ చేసింది ప్రియమణి.

డ్యాన్స్ షో కోసం డిజైన్ చేసిన పొట్టి గౌను ధరించి ఇలా ఫోజులిచ్చింది ప్రియమణి. ఇక ప్రియమణి ఫొటోలు చూసిన నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘లవ్ యూ, బ్యూటిఫుల్ , క్వీన్, యంగ్ లేడీ, ఫరెవర్ క్వీన్’ అని కామెంట్స్ చేస్తున్నారు. 37 ఏళ్లు వచ్చినప్పటికీ ఇంకా యంగ్ గానే ఉన్నావని ఓ నెటిజన్ పోస్ట్ పెట్టాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version