సినీ కార్మికుల డిమాండ్స్ పై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

-

సినీ కార్మికుల డిమాండ్స్ పై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. సినీ కార్మికుల డిమాండ్స్ కూర్చోని పరిష్కరించుకోవాలన్నారు. కరోనా కారణంగా కార్మికులు చాలా ఇబ్బంది పడ్డారని.. ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కార్మికులను చర్చలకు పిలవాలని వెల్లడించారు. ప్రభుత్వం జోక్యం చేసుకునే వరకు చూడొద్దని.. లేబర్ డిపార్ట్మెంట్ కు సమ్మె లేఖ ఇవ్వలేదని.. రెండుమూడు రోజుల్లో సమస్య పరిష్కరించుకోవాలని చెప్పారు.

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

నరేంద్రమోదీ రోజు ప్రపంచం గురించి నీతులు చెబుతారు… ప్రజా ప్రభుత్వాలు ఉండటం మోడీకి ఇష్టం లేదని ఆగ్రహించారు. ప్రపంచ దేశాల ముందు భారతదేశ పరువు, ప్రతిష్ట పోతుందని.. ఇలాంటి పరిణామాలు దేశానికి మంచిది కాదని వెల్లడించారు. దేశం సర్వనాశం అవ్వాలని బీజేపీ కోరుకుంటుందని.. తలెత్తుకుని గర్వంగా నిలబడలేకపోతుందని చెప్పారు. ఎలక్టేడ్ గవర్నమెంట్లు ఉండటం ఓర్వలేక పోతున్నారని.. ప్రజాస్వామ్య వ్యవస్థను ఖునీ చేస్తున్నారని ఆగ్రహించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version