రామంతపూర్ ప్రమాద మృతులకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నట్లు పేర్కొన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు ప్రకటన చేశారు.

రామంతపూర్ ఘటనలో గాయపడినవారిని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు… గాంధీ ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రుల పరిస్థితిపై వైద్యులతో ఆరా తీశారు. రామంతపూర్ ఘటన అత్యంత విషాదకరమని అభిప్రాయపడిన మంత్రి శ్రీధర్ బాబు…మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
కాగా హైదరాబాద్-ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతపూర్ గోఖలే నగర్‌లోని యాదవ్ సంగం ఫంక్షన్ హాల్ వద్ద శ్రీ కృష్ణాష్టమి వేడుకలు జరిగాయి. వేడుకల్లో భాగంగా శ్రీకృష్ణుడి విగ్రహాన్ని రథం బండిపై ఊరేగించారు. ఇక ఈ ఊరేగింపు ముగింపు సమయంలో రథం బండిని లోపలకి తోసుకుంటూ 9 మంది వెళ్తున్న క్రమంలో విద్యుత్ తీగలు తాకడంతో షాక్ తగిలి 6 గురు మృతి చెందారు.