తెలంగాణ ప్రాంతంలో రాబోయే రెండు గంటలలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ములుగు, పెద్దపల్లి, ఆదిలాబాద్, భద్రాద్రి, భూపాలపల్లి, నిర్మల్, కరీంనగర్, ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, నిజామాబాద్ జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ నిపుణులు చెబుతున్నారు. అలాగే వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగాం ప్రాంతాలలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.

ఇప్పటికే మెదక్, కామారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాలలో వర్షాలు అధికంగా కురవడంతో ప్రజలు చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. వర్షాలు భారీగా కురవడంతో చెరువులు, కాలువలు, నదులు నీటితో నిండిపోతున్నాయి. కొన్ని ప్రాంతాలలో జలపాతాలను చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో పరుగులు పెడుతున్నారు. నీరు ఎక్కువగా ఉన్నచోట ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.