SLBC ప్రాజెక్టు పనుల పూర్తికి తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసింది. సొరంగం తవ్వకంలో పెండింగ్ వర్క్ పూర్తికి సంప్రదాయ డ్రిల్లింగ్-బ్లాస్టింగ్ పద్దతికి నిర్ణయం తీసుకుంది. టన్నెల్ బోరింగ్ మిషన్ పద్దతికి స్వస్తి పలకాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ రాష్ట్ర సర్కార్.

నిర్మాణ సంస్థ సూచనతో డ్రిల్లింగ్-బ్లాస్టింగ్ పద్దతికే మొగ్గు చూపించినట్లు సమాచారం అందుతోంది. SLBC పనుల నిమిత్తం సమాలోచనలు జరుపుతున్న ప్రభుత్వం….SLBC ప్రాజెక్టు పనుల పూర్తికి ముందడుగు వేసింది.
డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ లాంటి పనులు చేయాలంటే అటవీశాఖ, పర్యావరణ శాఖతో అనేక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని తెలుపుతున్నారు విశ్రాంత ఇంజనీర్లు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న మృతదేహాలు బయటికి తీయకుండా, పనిచేసేందుకు కార్మికులు ఎలా ఆసక్తి చూపిస్తారంటూ నిర్మాణ సంస్థను నిలదీస్తున్నారు కార్మికులు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు జరిగిన రోజులకంటే నిలిచిపోయిన రోజులే ఎక్కువగా ఉన్నాయని ఆరోపిస్తున్నారు విశ్లేషకులు.