యూరియా సమస్యలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. యూరియా సమస్యలపై నేడు రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. గత రెండు నెలలుగా రాష్ట్రంలో రైతులు యూరియా కొరతతో సతమతవుతుంటే, ఈ రోజు మొద్దు నిద్ర లేచి యూరియా సమస్యలపై సమీక్ష నిర్వహించనున్నారు రేవంత్ రెడ్డి.

ఇది ఇలా ఉండగా… యూరియా కోసం క్యూ లైన్ లో గొడవపడి చెప్పులతో కొట్టుకున్న మహిళా రైతుల వీడియో వైరల్ గా మారింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ యార్డు ముందు మహిళా రైతులు బారులు తీరారు. ఈ తరుణంలోనే… క్యూ లైన్లలో రైతుల మధ్య కొట్లాటలు చోటు చేసుకున్నాయి. యూరియా కోసం రైతులను రోడ్లమీదికి తెచ్చిన సీఎం రేవంత్…అందరికీ గొడవ పెట్టిస్తున్నాడని విమర్శలు వస్తున్నాయి.