రాజ్ భవన్ లో మహిళా దినోత్సవం సందర్భంగా వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. ఈ సమయంలో తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్ని ఏళ్లు అవుతున్నా ఇంకా మహిళలు వివక్షతను ఎదుర్కొంటున్నారని.. సమాజంలో ఇప్పటికీ మహిళకు గౌరవం దక్కడం లేదని అన్నారు. అత్యున్నత పదవిలో ఉన్నా కూడా గౌరవం దక్కడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నన్ను ఎవరూ భయపెట్టలేదు.. నేను దేనికి భయపడనని సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత దేవ మహిళా లోకాన్ని ఎవరూ భయపెట్టలేరని ఆమె అన్నారు. ఆకాశం తలపై పడినా.. నేను భయపడనని అన్నారు. మహిళలు దేనికీ భయపడకూడదని ఆమె అన్నారు.
ఇటీవల బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ సమావేశాలు లేకుండానే ప్రారంభం అయ్యాయి. దీనిపై గవర్నర్ కూడా అసంత్రుప్తి వెల్లడించారు. తాజాగా ఈవ్యాఖ్యలు చూస్తుంటే.. ప్రభుత్వం, రాజ్ భవన్ మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.