విమాన ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్. విమాన టికెట్ ధరల్ని కంపెనీలు పెంచేలా కనపడుతోంది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరలు భారీగా పెరగడంతో విమాన టిక్కెట్ ధరలు పెంచాలని కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకోనుంది. గత రెండు నెలల నుంచి ఏటీఎఫ్ ధరలు ఎక్కువయ్యాయి.
రష్యా-ఉక్రెయిన్ ప్రభావంతో క్రూడాయిల్ ధరలు బాగా ఎక్కువవడంతో ఏటీఎఫ్ ధరలు మరింత పెరిగేలా కనపడుతోంది. డిసెంబర్ 15 నుంచి వీటి ధరలు 26.4 శాతం లేదా ఒక్కో కిలో లీటరు రూ.19,508.25 పెరిగాయి. మార్చి 1న చేపట్టిన ధరల పెంపుతో ఏటీఎఫ్ ధర ఢిల్లీలో రూ.93,530.66కు చేరుకుంది. పాపులర్ టైర్ 1 మార్గాలలో విమాన టిక్కెట్ ధరలను 15 శాతం నుంచి 20 శాతం కంపెనీలు పెంచేలా కనపడుతోంది.
అయితే ఈ నెలాఖరుకి రీజనల్ రూట్లలో 20-25 శాతం పెంచుతాయని తెలిపారు. ఢిల్లీ ముంబై మధ్య లో విమాన టిక్కెట్ ధర సుమారు రూ.2,300 నుంచి రూ.13 వేల నుంచి రూ.2,900 నుంచి రూ.15 వేలకు పెరగనుందని అంటున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నెలకొన్న సంక్షోభంతో క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయని ఈ సమయంలో ధరల పెంపు అనివార్యమని అన్నారు.
ఇండిగో, స్పైస్‌జెట్, గోఫస్ట్, విస్తారా, ఎయిర్ ఏసియా ఇండియా సంస్థల అధికార ప్రతినిధులు మాత్రం దీని గురించి ఏం చెప్పలేదు. దేశీయ టిక్కెట్ల ధరలు పెంచాలని ప్రభుత్వంతో ఎయిర్ లైన్ కంపెనీలు చర్చలు జరుపుతున్నాయని అన్నారు.