తాటి నీరు త్రాగండి..! రోగనిరోదక శక్తి పెంచుకోండి…!- గవర్నర్ తమిలిసై

-

governor tamilisai soundararajan speaks with agriculture professionals
governor tamilisai soundararajan speaks with agriculture professionals

రోగనిరోధక శక్తిని పెంపొందించే వంగడాలను అభివృద్ధిచేసి, అలాంటి పంటలను పండించే విధంగా రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయశాస్త్రవేత్తలకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పిలుపునిచ్చారు. మన ముందు తరాలు తీసుకున్న పోషకాహారంతో ఎక్కువ సంవత్సరాలు జీవించారని, కానీ ఇప్పటితరంలో చాలామంది మధుమేహం వస్తుందని వరి అన్నంకు దూరంగా ఉంటున్నారని పేర్కొన్నారు. వరి వంగడాలను శాస్త్రీయంగా పరిశోధించి వాటిలో చక్కెర శాతాన్ని తగ్గించడానికి ప్రయత్నించాలి అని గవర్నర్‌ ఈ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్తలను కోరారు.

ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయ అధికారులతో గురువారం ఆమె వీడియో కాన్ఫిరెన్స్‌ ద్వారా రాజ్‌భవన్‌ నుంచి సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధకులు అభివృద్ధిచేసిన తెలంగాణ సోన అనే ప్రత్యేక వెరైటీని ప్రోత్సహించడం ద్వారా యువతను వరి అన్నానికి దగ్గర చేయవచ్చని తద్వారా మన దక్షిణ భారతదేశ సంప్రదాయాన్ని కూడా కాపాడుకోవచ్చని వివరించారు. ఆమె మాట్లాడుతూ తాటి చెట్టు విశిష్టతను వారికి గుర్తుచేశారు. తాటి చెట్టు ఓ అద్భుతమైన కల్పవృక్షం అని ఆ చెట్టులోని ప్రతీ భాగం ఊగయోగకరం అని ఆమె తెలియజేశారు. ఎన్నో ఔషద విలువలు పోషక విలువలు ఉండే తాటి నీరుని ఎక్కువకాలం నిల్వ ఉండేలా చేయడానికి పరిశోధనలు చేయాలని ఆమె వారిని కోరారు. ప్రజలకు ఆహార నియమాలను ఆహార అవగాహనలను తెలియజేసే చర్యలు చేయడం తప్పనిసరి అని వారికి ఆమె పిలుపినిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version