బీహార్ రాష్ట్రంలో గురువారం పిడుగుల వర్షం పడింది. వర్షం తీవ్రత భారీగా ఉండటంతో 83 మంది మృతి చెందినట్లు బీహార్ ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. 83 మంది మరణించగా అనేక మంది గాయాలపాలయ్యారు దీంతోపాటు భారీ ఆస్తి నష్టం కూడా వాటిల్లినట్టు సమాచారం. రాష్ట్రంలోని గోపాల్‌గంజ్‌లో 13మంది, మధుబణి, నవాడలో 8చొప్పున, భగల్‌పూర్, సివాన్‌లో ఆరుగురు, దర్బాంగ్, బంకా, తూర్పు చంపారన్‌లో ఐదుగురు, ఖజారియా, ఔరంగాబాద్‌లో ముగ్గురు చొప్పున మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. దక్షిణ చంపారన్, కిషన్‌గంజ్, జాము, జహన్‌బాద్, పుర్ణియ, సుపౌల్, బక్సార్, కైమూర్‌లో ఇద్దరు చొప్పున, సమస్తీపూర్, శివ్‌హర్, సరాన్, సీతామర్హి, మదెపురలో ఒక్కొక్కరు చొప్పున చనిపోయినట్లు జిల్లా అధికారులు ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ఒక్కొక్కరికి 4 లక్షల ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు. బాధితుల కుటుంబాలకు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రగాడ సానుభూతి తెలిపారు బాధిత కుటుంబాలకు శీగ్రకాలంలో పరిహారం అందేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
విషాదం:… హృదయవిదారక బాధలో బీహార్ సీఎం…! 83 మంది మృతి..!
-