ఎంతో కష్టపడి చదివి వివిధ శాఖలలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి సంతోషంగా తమ జీవితాలను కొనసాగిస్తున్న వారు ఎందరో ఉన్నారు. కానీ అదే ప్రభుత్వ ఉద్యోగులలో పోలీస్, ఫారెస్ట్ ఆఫీసర్స్ , సైనికులు లాంటి వారికి ఎప్పుడు ఏ ఆపద వస్తుందో ఎవ్వరూ ఊహించలేరు. కొన్ని సార్లు వారి ప్రాణాలు కూడా పోయే అంత పరిస్థితులు వారిని చుట్టుముడుతుంటాయి. అలా విధులను నిర్వర్తిస్తూ మరణించిన వారికి ప్రభుత్వం ఏమైనా ఇస్తుందా అంటే కొన్ని డిపార్ట్మెంట్ అధికారులకు మాత్రమే ఇస్తున్నట్లు ప్రాథమిక సమాచారం.
తాజాగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారుతోంది. అటవీశాఖ డిపార్ట్మెంట్ కు సంబంధించి అధికారులు విద్యలను నిర్వర్తిస్తూ సంఘ విద్రోహ శక్తుల చేతిలో మరణిస్తే వారి యొక్క కుటుంబానికి పరిహారాన్ని అందించాలని నిర్ణయం తీసుకుంది. దీనిని చట్టం చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులను విడుదల చేసింది. ఆ ఉత్తర్వుల ప్రకారం IFS అధికారి మరణిస్తే రూ. కోటి, ACF, DCF అధికారి మరణిస్తే రూ. 75 లక్షలు, రేంజ్ అధికారులకు రూ. 50 లక్షలు, డిప్యూటీ రేంజ్ అధికారులకు రూ. 40 లక్షలు, అదే విధంగా బీట్ అధికారులు మరణిస్తే రూ. 30 లక్షలు వారి కుటుంబాలకు పరిహారంగా అందచేస్తారు.