భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డెంగ్యూ జర్వాలు ప్రబలుతున్నాయి. కరోనా కేసుల కంటే.. డెంగ్యూ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. డెంగ్యూ జ్వరానికి ఆరోగ్య శ్రీ లో ఉచితంగా చికిత్స అందిస్తామని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
దీనిపై ప్రైవేట్ ఆస్పత్రులకు కూడా ఆదేశాలు ఇస్తామని ప్రకటన చేశారు. 2019 -19 తో పోలీస్తే.. ఇప్పుడు డెంగ్యూ జ్వరాల తీవ్ర త చాలా తక్కువగానే ఉందన్నారు మంత్రి హరీష్ రావు.
2020 లో కరోనా కారణంగా అందరూ ఇండ్లకే పరిమితం కావడం కారణంగా డెంగ్యూ కేసుల సంఖ్య ఎక్కువగా నమోదు కాలేదని చెప్పారు. కానీ ఈ సారి.. ప్రజలు బయట తిరగడం, వర్సాలు భాగా పడటం కారణంగా డెంగ్యూ బాధితుల సంఖ్య పెరుగుతున్నట్లు చెప్పారు. ప్రజలందరూ డెంగ్యూ వైరల్ ఫివర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు.