తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్!

-

  • త్వ‌ర‌లో 50 వేల ఉద్యోగాల భ‌ర్తీ !
  • అతిత్వ‌ర‌లో నిరుద్యోగుల‌కు నిరుద్యోగ‌భృతి
  • రాష్ట్ర మున్సిప‌ల్‌ అడ్మినిస్ట్రేషన్, పట్టణ అభివృద్ధి శాఖ‌ మంత్రి కేటీఆర్‌

హైద‌రాబాద్: ముఖ్య‌మంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్ర‌భుత్వం నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌ను అందించింది. రాష్ట్రంలోని నిరుద్యోగులంద‌రికి త్వ‌ర‌లోనే నిరుద్యోగ భృతిని అందిస్తామ‌ని తెలిపింది. ఈ మేర‌కు తెలంగాణ రాష్ట్ర మున్సిప‌ల్‌ అడ్మినిస్ట్రేషన్, పట్టణ అభివృద్ధి శాఖ‌ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ విష‌యాన్ని స్ప‌ష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్ర మున్సిప‌ల్‌ అడ్మినిస్ట్రేషన్, పట్టణ అభివృద్ధి శాఖ‌ మంత్రి కేటీఆర్

గురువారం తెలంగాణ భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన విద్యుత్ కార్మిక సంఘం స‌మావేశం జ‌రిగింది. దీనిలో  కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. రాష్ట్రంలోని నిరుద్యోగులంద‌రికీ అతి త్వ‌ర‌లో నిరుద్యోగభృతిని అందిస్తామ‌న్నారు. ఇప్పటివ‌ర‌కూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఒక ల‌క్షా 30 వేల ఉద్యోగాలు క‌ల్పించింద‌నీ, త్వ‌ర‌లోనే మ‌రో 50 వేల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తామ‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

కాగా, తెలంగాణలో మొత్తం 1.91 లక్ష‌ల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయ‌ని తాజాగా పీఆర్‌సీ నివేదిక పేర్కొంది. మొత్తం 4,91,304 పోస్టుల‌కు గానూ ప్ర‌స్తుతం ఇందులో 61 శాతం మాత్ర‌మే పోస్టులు నిండుగా ఉన్నాయి. 39 శాతం ఖాళీ పోస్టులు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version