కేసులు పెరుగుతున్నాయి.. ప్రమాదం వచ్చే ఛాన్స్ ఉంది : తెలంగాణ హెల్త్ డైరెక్టర్ వార్నింగ్

-

ఒమిక్రాన్ వైరస్ 20కి పైగా దేశాలలో వ్యాపించిందని…అజాగ్రత్తగా ఉంటే… త్వరలోనే ముప్పు తప్పదని వార్నింగ్‌ ఇచ్చారు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. కరోనా కేసులు పెరుగుతున్నాయని అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. 325 మంది విదేశీ ప్రయాణికులకు పరీక్షలు చేయడం జరిగిందని…అందులో 35 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు.
టిమ్స్ లో ట్రీట్మెంట్ చేస్తున్నాం. జీనోమ్ సిక్వీన్స్ కి నమూనాలు పంపించామని తెలిపారు. కొత్త వేరియంట్‌ పై క్యాబినెట్ సబ్ కమిటీ మూడు గంటల పాటు చర్చించిందని… సర్వేలేన్స్ సిస్టం, ఆస్పత్రుల్లో వసతులపై చర్చించామని వెల్లడించారు.

మూడు రోజుల్లోనే మూడు దేశాల నుంచి 24 దేశాలకు వ్యాప్తి చెందిందని.. వ్యాక్సిన్లు ప్రాణాలను రక్షిస్తుందన్నారు. ప్రజల చెంతకు వ్యాక్సిన్లు వస్తున్నాయి… సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 5.90 లక్షలు హైదరాబాద్ లో, 4.80 లక్షలు మేడ్చల్ లో, 4.10 లక్షల మంది రంగారెడ్డిలో రెండో డోస్ వేసుకోవాల్సి ఉందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 25 లక్షల మంది రెండో డోస్ తీసుకోవాల్సి ఉంది… వీరంతా వెంటనే వ్యాక్సిన్ వేసుకోవాలని కోరుతున్నామన్నారు. వ్యాక్సిన్ వేసుకోకపోతే ఆత్మహత్య చేసుకున్నట్లేనని హెచ్చిరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version