మహబూబాబాద్ కిడ్నీ దానం అంశంపై ఆరోగ్య శాఖ మంత్రి రియాక్షన్..!

-

మహబూబాబాద్ జిల్లాలో డబ్బుల కి కిడ్నీ దానం అంశం పైనా స్పందించారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలతో మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న చిట్టిబాబు పరిశీలించారు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మురళీధర్. కిడ్నీ దానం చేసి ధరావత్ చిట్టిబాబు ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది. ధరావత్ చంద్రుకు, చిట్టిబాబు అనే వ్యక్తి మధ్య జరిగిన ఒప్పంద ప్రకారం కిడ్నీని దానం చేసారు.

హైదరాబాదులోని కేర్ హాస్పిటల్ లో కిడ్నీ మార్పిడి జరిగింది. చిట్టిబాబు కిడ్నీ వేరే ఒకరికి ఇవ్వడం ద్వారానే ఆరోగ్యం క్షీణించిందని, కూతురు, అల్లుడు, కురవి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వారి ఇరువురి ఒప్పంద ప్రకారమే కిడ్నీ మార్పిడి జరిగింది, పోలీసులు విచారణలో అదే తేలింది. పోలీసులను కూడా పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నారు. ఇరువురు ఒప్పందం ప్రకారమే కిడ్నీ దానం జరిగింది కాబట్టి ఇది లీగల్ గానే పరిగణించాల్సి ఉంటుందంటున్న జిల్లా ఆరోగ్యశాఖ అధికారి.. కిడ్నీ మార్పిడి సక్రమంగా జరిగిందా లేదా అనేది మరి కొంత సమాచారం తీసుకున్న తర్వాతే స్పష్టమవుతుందంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news