ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. 0214లో హూజుర్ నగర్ ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు వెంటాడుతుంది. సోమవారం.. ఏపీ సీఎం జగన్ కు సమన్లు పంపించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నాంపెల్లి ప్రజా ప్రతినిధుల కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. ఏపీ సీఎం జగన్ కు సమన్లు పంపించింది. దీంతో ఏపీ సీఎం జగన్.. తెలంగాణ హై కోర్టును ఆశ్రయించారు.
తనపై ఉన్న హూజుర్ నగర్ ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు కొట్టివేయాలని.. క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్యాష్ పిటిషన్ పై నేడు తెలంగాణ హై కోర్టు విచారణ జరిగింది. ఏపీ సీఎం జగన్ ను ఈ కేసు విషయంలో వ్యక్తిగత హాజరు పై తెలంగాణ రాష్ట్ర హై కోర్టు స్టే విధించింది. ఏప్రిల్ 26 వరకు జగన్ హాజర్ పై న్యాయస్థానం స్టే విధించింది. కాగ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.. 2014 లో అనుమతి లేకుండా.. హుజూర్ నగర్ లో ర్యాలీ నిర్వహించాడని అభియోగం ఉంది. దీనిపై అప్పట్లో టీఆర్ఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.