వింటున్నారా.. తెలంగాణ గరీబోళ్ల రాష్ట్రం కాదట.. ??

-

ఏ నాయకులు అధికారంలోకి వచ్చినా వారి జేబులు నిండుతాయి గానీ ప్రజల కడుపులు నిండవు.. ఆటకు ముందు ఆటకు వెనకలా ప్రతి రాజకీయ నాయకునికి ఒక లెక్క ఉంది.. ఎందుకంటే ప్రజలు ఉంటుంది సత్య యుగంలో కాదు.. కలియుగంలో అని గుర్తుంచుకోవాలి.. నేటి సమాజంలో అడుగంటుతున్న న్యాయానికి అవినీతి గుడ్డలు చుట్టి ఇదే న్యాయం అని చెప్పి రాజకీయాలు చేసే నాయకులు తయారు అయ్యారు.. ఒక్కరంటే ఒక్కర్ని చూపించండి అవినీతి మరక అంటని నాయకున్ని.. ఎవరు లేరు, ఉండరు.. ఒకవేళ ఇలా ఉంటే వారు బ్రతకరు.. ఇది నిజమని కొందరి భావన కాగా మరికొందరు ఇలా అభిప్రాయపడుతున్నారట..

ఇకపోతే మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ రిజర్వ్‌ ఫారె‌స్ట్‌లో ఆరో విడత హరితహారాన్ని సీఎం కేసీఆర్‌ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ గరీబోళ్ల రాష్ట్రం కాదు. వందకు వంద శాతం ధనిక రాష్ట్రమే. నేను అధికారికంగా చెబుతున్నా అని పేర్కొన్నారు.. ఇక కరోనా విపత్తు సంభవించడం వల్ల మూడు నెలలు సగం జీతాలు ఇచ్చాం. కానీ మళ్లీ నెల రోజుల్లోనే పుంజుకున్నాం, కాగా ఉద్యోగులకు తక్కువ జీతాలు ఇచ్చి ఆ మొత్తాన్ని రైతులకు పంచామని కేసీఆర్‌ తెలిపారు. అంతే కాకుండా ప్రస్తుత పరిస్దితుల్లో తెలంగాణ రైతుల దగ్గర తప్ప ఎవరి దగ్గరా పైసల్లేవని ఈ సందర్భంగా ప్రస్తావించడం విశేషం..

 

ఇదిలా ఉండగా కరోనా ప్రభావంతో పైసలు లేకుండాపోయాయని, అయినా, ఇక్కడికి వచ్చినందుకు నర్సాపూర్‌కు నిధులు ఇస్తున్నట్లు ఈ సభలో సీఎం ప్రకటించారు. నియోజకవర్గంలోని 200 గ్రామాలకు ఒక్కో గ్రామానికి రూ.20 లక్షల చొప్పున, ఏడు మండల కేంద్రాలకు రూ.కోటి చొప్పున, నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్‌కు 25 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version